ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా దళితులపై దాడులు జరుగుతున్నాయని ఉమ్మడి చిత్తూరు జిల్లా వైయస్ఆర్ సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి ధ్వజమెత్తారు. నగరి మండలం తడుకుపేట దళితులపై దాడి ఘటనలో నిందితులను వెంటనే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వైయస్ఆర్ సీపీకి ఓటు వేశారని దళితులు ఇళ్లపై దాడి, వాహనాలు ధ్వంసం అమానుషమన్నారు. చుండూరు, కారంచేడు ఘటనల్ని తలపించేలా తడుకుపేట ఘటన జరిగిందని భూమన మండిపడ్డారు.శ్రీకాళహస్తి నియోజకవర్గంలో యానాదులు పై కూడా ఇదే తరహాలో దాడులు చేస్తున్నారని, చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా దళితులపై దాడులు జరుగుతూ ఉన్నాయన్నారు. కూటమి ప్రభుత్వంలో దళితులు, బీసీ, ఎస్టీలకు రక్షణ లేదన్నారు.