గడ్డి వాముకు నిప్పంటుకొని దగ్ధ మైన సంఘటన బుధవారం మండల కేంద్రం యాడికిలోని వేములపాడు రోడ్డు సమీపంలో చోటుచేసుకుంది. బాధితుడు ఆదినారాయణ తెలిపిన వివరాల మేరకు. యాడికి లోని వేములపాడు రోడ్డులో గడ్డి వాము నిల్వ చేసుకు న్నాడు. బుధవారం మధ్యాహ్నం ఉన్నట్లుండి మంటలు రావడంతో గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక ఎస్ఐ రామాంజనేయులు, సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు. అప్పటికే గడ్డివాము కాలి బుడిదైంది. దీంతో దాదాపు రూ. 40 వేలు నష్టం వాటిల్లినట్లు రైతు వాపోయాడు.