ఉత్తరప్రదేశ్-మధ్యప్రదేశ్ పోలీసుల నిర్వాకంతో కొన్ని గంటలపాటు రోడ్డుపైనే ఓ మృతదేహం ఉండిపోయింది. పనికోసం ఢిల్లీకి వెళ్తున్న రాహుల్ అహిర్వార్ అనే వ్యక్తి ..మధ్యప్రదేశ్‌లోని హర్పాల్‌పుర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో వాహనం ఢీకొని మృతిచెందాడు.
ఈ ప్రమాదం జరిగిన ప్రాంతం ఉత్తరప్రదేశ్ ప్రాంతానికి వస్తుందని మధ్యప్రదేశ్ పోలీసులు..మధ్యప్రదేశ్‌కు వస్తుందని ఉత్తరప్రదేశ్ పోలీసులు వెనుదిరిగారు. స్థానికులు ఆందోళన చేపట్టడంతో చివరికి మృతదేహాన్ని మధ్యప్రదేశ్ పోలీసులు శవపరీక్షకు తరలించారు.