గంజాయి నిర్మూలనలో కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ, పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరుదు కళ్యాణి విమర్శించారు. ఇందుకు నిదర్శనమే విశాఖ సెంట్రల్ జైలులో గంజాయి మొక్క కనిపించడమేనన్నారు. ఒక సెంట్రల్ జైలులో గంజాయి మొక్క కనిపించడం దారణమన్నారు వరుదు కళ్యాణి. వంద రోజుల్లో గంజాయి నిర్మూలిస్తానని హోంమంత్రి అనిత శపథం చేశారని, ఇప్పుడు ఎక్కడ చూసినా గంజాయి సాగు అవుతుందని ధ్వజమెత్తారు. ఆదివారం వరుదు కళ్యాణి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో కూడా గంజాయి సాగవుతుంది. మీ వైఫల్యాలని కప్పి పుచ్చుకోవడం కోసం నెపం ప్రతిపక్షంపై నెట్టడం దుర్మార్గం. ఇది చేతకాని ప్రభుత్వం. విచ్చలవిడిగా గంజాయి దొరుకుతుందని స్పీకర్ అయ్యన్నపాత్రుడు చెప్పారు. గంజాయి నిర్మూలనకు కాకుండా ప్రతిపక్షాలని టార్గెట్ చెయ్యడానికి మాత్రమే పోలీసులను వాడుతున్నారు. అందుకే దుర్మార్గులు మహిళలపై దాడులకు తెగబడుతున్నారు. రాష్ట్రంలో క్రైమ్ రేట్ పెరిగింది. మహిళలపై దాడులు పెరిగాయి. రాష్ట్రంలోగంజాయిని అరికట్టాల్సిందే’ అని వరుదు కళ్యాణి డిమాండ్ చేశారు.