గత రెండు రోజులుగా ఎల్లో మీడియాలో, సోషల్ మీడియాలో తెలుగుదేశం అనుకూల పత్రికల్లో రూ.700 కోట్ల కుంబకోణం అంటూ ఊదరగొడుతున్నారు. రాష్ట్రం అంతా భూములను వైయస్ జగన్ గారు, వారి అనుచరులు దోచుకున్నారని పెద్ద ఎత్తున దుష్ర్పచారం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి డైవర్షన్ పాలిటిక్స్ చేయడం అలవాటుగా మారింది. ప్రతినెలా ఒక అంశాన్ని తీసుకుని, దానిచుట్టూ ఒక కథను అల్లడం, దానిపైన అభూత కల్పనలను జోడించి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీపైన బురదచల్లడం చేస్తున్నారు. ఎందుకిలా చేస్తున్నారంటే కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు, అసాంఘిక శక్తుల విజృంభణ, వారి అరాచకాలు, మరోవైపు హామీలను అమలు చేయలేని నిస్పహాయస్థితిలో ప్రజాగ్రహం తమపైన ఎక్కడా పెల్లుభికుతుందోననే భయంతోనే ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్ కు దిగజారుతున్నారు అని వైయస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి మండిపడ్డారు.