విద్యాశాఖను నారా లోకేశ్ సమర్థవంతంగా నిర్వహించలేక చేతులెత్తేయడమే కాకుండా, ఆ శాఖలో గత ప్రభుత్వంలో తెచ్చిన సంస్కరణలకు తూట్లు పొడిచేశాడని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకటో తేదీన తన శాఖ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని ఈ మంత్రి.. తన వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు వైయస్ భారతిపై నోటికొచ్చినట్టు అవాకులు చెవాకులు పేలుతున్నారని ఆయన ఆక్షేపించారు. విశాఖ అభివృద్ది ఎవరి హయాంలో జరిగిందో లోకేశ్‌కి తెలియకపోతే అధికారులను అడిగి తెలుసుకోవాలని, అంతేకానీ నోటికొచ్చినట్టు అబద్ధాలు మాట్లాడితే బుద్ధి హీనుడిగా మిగులుతారని హితవు పలికారు.