ఢిల్లీ వాసులకు ఇవాళ కాస్త ఉపశమనం లభించింది. సోమవారం ఉదయం రాజధాని నగరంలో తేలికపాటి వర్షంకురిసింది. దీని కారణంగా వాతావరణం మారిపోయింది. మంచు నుంచి ఉపశమనం లభించింది.
దీంతో విజిబిలిటీ సైతం మెరుగుపడింది. ఇవాళ ఉదయం ఢిల్లీ ఇందిరాగాంధీ ఎయిర్‌పోర్ట్ రన్‌వేపై విజిబిలిటీ 1,000 మీటర్ల నుంచి 2,000 మీటర్ల మధ్య ఉంది. ఈ కారణంగా విమాన కార్యకలాపాలకు ఎలాంటి ప్రభావం పడలేదు.