ములుగు జిల్లా మంగపేట మండలంలో నకిలీ రూ. 500 నోట్లు చెలామణీ అవుతున్నాయంటూ సోషల్ మీడియా, వాట్సప్ గ్రూపుల్లో సోమవారం పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి.
ఒరిజినల్ రూ. 500 నోటుపై RESERVE ఉండాల్సి ఉండగా నకిలీ నోటు పై RESARVE అని ముద్రించి చలామణి చేస్తున్నారన్నారు. దీనిని వ్యాపారులు, ప్రజలు గుర్తించాలని సోషల్ మీడియా ద్వారా అప్రమత్తం చేస్తున్నారు.