ఒడిశాలో రాజకీయ వేడీ రాజుకుంటోంది. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేడీ ఆధ్వర్యంలో ప్రజలు రోడ్డెక్కారు. నిత్యాసవర ధరలు ఆకాశాన్నంటుతున్న ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని భువనేశ్వర్‌లో బీజేడీ కార్యకర్తలు, ప్రజలు నిరసన వ్యక్తం చేయడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రభుత్వం వెంటనే స్పందించి నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని లేకపోతే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.