ఇటీవల స్టార్‌లింక్ డివైజ్‌లను ఉపాయోగించుకొని నేరస్థులు అక్రమంగా ఇంటర్నెట్ సేవలు పొందుతున్నట్లుగా పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మణిపుర్, అండమాన్ నికోబార్‌లో స్టార్‌లింక్ డివైజ్‌లు బయటపడ్డాయి.
కొనుగోలుదారుల వివరాలు చెప్పాలని అధికారులు కోరగా.. అది వినియోగదారుల గోప్యతకు ముప్పంటూ స్టార్‌లింక్ వెల్లడించలేదు. మణిపుర్‌లో డివైజ్ దొరికిన సమయంలోనూ భారత్‌లో ఈ సేవలకు సంబంధించిన బీమ్స్‌ను ఆఫ్‌లో ఉంచామని మస్క్ ప్రకటించారు.