స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) 13 వేలకు పైగా క్లర్క్(జూనియర్ అసోసియేట్స్-కస్టమర్ సపోర్ట్ సేల్స్) పోస్టుల కోసం రిక్రూట్ చేస్తోంది. ఈ రిక్రూట్‌మెంట్‌లో పాల్గొనడానికి దరఖాస్తుకు చివరి తేదీ 7 జనవరి 2025.
అయితే.. గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇది ఓ సువర్ణావకాశం. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు SBIఅధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ ఫారమ్‌ను నింపవచ్చు.