జబర్దస్త్ కామెడీ షోతో తెలుగు ప్రేక్షకుల మనసులు దోచుకున్న యాంకర్ అనసూయ భరద్వాజ్. కేవలం యాంకర్‌గానే కాకుండా నటిగా కూడా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది అనసూయ. ఇప్పుడు ఆ గుర్తింపుకు అవార్డులు కూడా తోడు అయ్యాయి. ఆమె నటించిన రంగస్థలం సినిమా ఎలాంటి సంచలనం సృష్టించిందో.. అందులో రంగమ్మత్త పాత్ర ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈ సినిమాకు ఇప్పుడు ఫిల్మ్ ఫేర్ అవార్డుల పంట పండింది. అందులో అనసూయకు కూడా అవార్డ్ వచ్చింది. ఉత్తమ సహాయ నటిగా 2019కి గానూ అనసూయ ఈ అవార్డ్ గెలుచుకుంది. ఇదే సినిమాలో నటనకు రామ్ చరణ్ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యాడు. దేవీ శ్రీ ప్రసాద్ ఉత్తమ సంగీత దర్శకుడిగా.. చంద్రబోస్‌కు ఉత్తమ గేయ రచయితగా అవార్డులు వచ్చాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa