ఈ ఏడాది మార్చిలో విడుదలైన చిత్రం ‘పలాస 1978’. ఈ చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు దర్శకుడు కరుణ కుమార్. వసూళ్లతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న సినిమాను తెరకెక్కించిన ఈ దర్శకుడిని సినీ ప్రముఖులందరూ అభినందిస్తున్నారు. లేటెస్ట్‌గా మంచి సినిమా చేశారంటూ కరుణ కుమార్‌ను అభినందిస్తూ ‘పలాస 1978’ చిత్ర బృందానికి తన విషెస్ తెలియజేశారు స్టైలిస్ స్టార్ అల్లు అర్జున్. ఈ సందర్భంగా దర్శకుడు కరుణ కుమార్‌కు ఓ మొక్కను బహూకరించారు అల్లు అర్జున్. మంచి సినిమాను ప్రోత్సహిస్తూ తన అభినందనలు అందజేసిన అల్లు అర్జున్‌కు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు కరుణ కమార్. తన జీవితంలో ఇదొక అద్భుత జ్ఞాపకంగా మిగిలిపోతుందంటూ కరుణ కుమార్ ట్వీట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa