చెన్నైలోని T-నగర్ లో నిన్న సాయంత్రం మునిస్వామి అనే ఒక వికలాంగుడు రోడ్డు దాటుతుండగా కారు ఢీకొంది. ఇది చూసిన స్థానికులు ఆ కారును వెంబడించారు. అయినా ఆ కారు ఆగకుండా వెళ్ళిపోయింది. గాయాలపాలైన ఆ వికలాంగుడిని స్థానికులు ప్రభుత్వాసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. మునిస్వామి అక్కడే ప్రాణాలు విడిచాడు. పక్కనే ఉన్న సీసీటీవీ లో ఇదంతా రికార్డావడంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో దుమారం రేపుతోంది. అయితే ఆ కారు ప్రముఖ తమిళ నిర్మాత T. రాజేందర్ మరియు ఆయన కుమారుడు, స్టార్ హీరో శింబు లకు చెందినదిగా తెలుస్తోంది. ఈ మేరకు శింబు డ్రైవర్ సెల్వం ను పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. అయితే ప్ప్రమాదం జరిగినపుడు కారు ఎవరు నడిపారు? ఆ సమయంలో శింబు గానీ, ఆయన కుటుంబ సభ్యలు గానీ కారులో ఉన్నారా? అనే విషయాలు తెలియాల్సి ఉంది. దీనిపై శింబు కుటుంబం ఇంకా ఎటువంటి స్పందన తెలియచేయలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa