కోలీవుడ్ స్టార్ హీరో సూర్య అండ్ గ్లామర్ బ్యూటీ ప్రియాంక మోహన్ నటించిన "ఎతర్క్కుం తునింధవన్" సినిమా మార్చి 10, 2022న థియేటర్లలో విడుదలైంది.పాండిరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తమిళనాడులో సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది.లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం,సూర్య తన తదుపరి సినిమాని దర్శకుడు శివతో చేస్తున్నట్లు సమాచారం.ఈ చిత్రానికి తమిళ రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తునట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.అయితే ఈ విషయాన్ని మేకర్స్ ఇప్పటి వరకు అధికారికంగా ఏమీ ప్రకటించలేదు.ఈ కాంబినేషన్ గురించి సూర్య అభిమానులు చాలా ఎగ్జైటింగ్‌గా ఉన్నారు.సూర్య ప్రస్తుతం 'వాడివాసల్' సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.తర్వాత దర్శకుడు బాలతో కూడా ఒక సినిమాకి సైన్ చేసారు ఈ సినిమాలో సూర్య భార్య,నటి జ్యోతిక కథానాయికగా కనిపించనుందని సమాచారం.సూర్య 2డి ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa