తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ భాషల్లో గ్లామర్ క్వీన్ గా రాయ్ లక్ష్మికి మంచి క్రేజ్ వుంది. అలాంటి రాయ్ లక్ష్మి ప్రస్తుతం తెలుగులో 'వేర్ ఈజ్ ద వెంకట లక్ష్మి' సినిమా చేస్తోంది. ఈ సినిమాతోనే కిషోర్ కుమార్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. శ్రీధర్ రెడ్డి .. ఆనంద్ రెడ్డి .. ఆర్కే రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాలో పూజిత పొన్నాడ ప్రత్యేకమైన పాత్రలో కనిపించనుంది.
మహత్ .. నవీన్ నేని .. పంకజ్ ముఖ్యపాత్రలను పోషిస్తున్నారు. దసరాకు ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో దర్శక నిర్మాతలు వున్నారు. 'ఖైదీ నెంబర్ 150' సినిమాలో 'రత్తాలు .. రత్తాలు' పాట నుంచి రాయ్ లక్ష్మి క్రేజ్ మరింతగా పెరిగిపోయింది. అలాంటిది ఆమెనే ప్రధాన పాత్రగా రూపొందుతోన్న ఈ సినిమాపై అందరిలోనూ ఆసక్తి ఉంది. రత్తలుగా కవ్వించిన రాయ్ లక్ష్మి .. వెంకటలక్ష్మిగా ఎంతవరకూ మెప్పిస్తుందో చూడాలి.
#WhereIsTheVenkatLakshmi #Day5 All the best my beautiful queen @iamlakshmirai pic.twitter.com/T8lRsKUQXw
— Raai Laxmi Big Fan(@Raailaxmibigfan) August 9, 2018
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa