మెగాస్టార్ చిరంజీవి ఎడిటర్ గౌతంరాజు మృతిపై సంతాపం తెలుపుతూ ఎమోషనల్ గా ట్వీట్ చేశారు. గౌతమ్ రాజు లాంటి గొప్ప ఎడిటర్ ని కోల్పోవడం దురదృష్టకరం. ఎంత నెమ్మదస్తుడో, ఆయన ఎడిటింగ్ అంత వేగం. నా చట్టానికి కళ్ళు లేవు సినిమా నుంచి “ఖైదీ నెంబర్ 150″ వరకు ఎన్నో చిత్రాలకు వర్క్ చేశారు. గౌతమ్ రాజు మరణం వ్యక్తిగతంగా నాకు, చిత్ర పరిశ్రమకు తీరని లోటు. వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానని ట్వీట్ చేశారు.
Rest In Peace Gowtham Raju garu! pic.twitter.com/kmkii0wM8K
— Chiranjeevi Konidela (@KChiruTweets) July 6, 2022