కన్నడ నటి, యు టర్న్ ఫేమ్ శ్రద్ధా శ్రీనాధ్ లక్కీ ఛాన్స్ కొట్టేసింది. అమితాబ్, తాప్పీ ప్రధాన పాత్రలో నటించిన బాలీవుడ్ మూవీ పింక్ ను తమిళంలో రీమేక్ చేస్తున్నారు.. ఈ మూవీని బోనీ కపూర్ నిర్మించడం విశేషం. బిగ్ బి నటించిన పాత్రలో తమిళ టాప్ హీరో అజిత్ కనిపించనున్నాడు.. ఇక తాప్సీ పాత్రలో శ్రద్ధా శ్రీనాద్ ను తీసుకున్నారు.. మరో కీలక పాత్రలో విద్యా బాలన్ నటించనుంది. ఈ మూవీలో హీరోయిన్ గా ఎన్నికైన సందర్భంగా శ్రద్ధా మీడియాతో మాట్లాడుతూ, ‘అజిత్ చిత్రంలో నేను నటించబోతున్నానని చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. అవి నిజమైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ అద్భుతమైన సినిమాలో నేనూ భాగమయ్యాను. చాలా మంది దీని గురించి గతంలో నన్ను అడిగారు. కానీ నిర్ధారణ అయ్యాక చెబుదామని మౌనంగా ఉన్నాను. అలా ఉండటం చాలా కష్టమనిపించింది. ఇప్పుడు గర్వంగా ప్రకటిస్తున్నాను. ఇప్పటివరకు నేను నటించని ఛాలెంజింగ్ పాత్ర ఈ సినిమా ద్వారా నాకు దక్కిందని నమ్మకంగా చెప్పగలను. ఓపక్క ఎగ్జైటింగ్‌గా ఉన్నా మరోపక్క కంగారుగా కూడా ఉంది. ఇది అందరూ తప్పకుండా చూడాల్సిన సినిమా’ అని వెల్లడించింది
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa