ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అనతి కాలంలోనే మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్స్‌లో సంయుక్త ఒకరు. బింబిసారా, సార్, విరూపాక్ష వంటి సినిమాల్లో తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన ఈ అమ్మడు ప్రస్తుతం వరుస ఆఫర్లు అందుకుంటున్నట్లు తెలుస్తున్నది.ఇప్పటికే ఈ బ్యూటీ తెలుగులో స్వయంభూ, శర్వా37తో పాటు అఖండ-2లో కూడా నటిస్తుంది. అలాగే మలయాళం, హిందీలో కూడా ప్రాజెక్టులు లైన్లో పెట్టింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ అమ్మడు మరో బంపర్ ఆఫర్ అందుకున్నట్లు ఇన్సైడ్ టాక్.మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఓ మూవీ వస్తున్న సంగతి తెలిసిందే. 'మన శంకర వరప్రసాద్' అనే టైటిల్‌తో రాబోతున్న ఈ మూవీ ఇప్పటికే నయనతారను హీరోయిన్గా ఫిక్స్ చేస్తూ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు సెకండ్ హీరోయిన్గా సంయుక్తను ఫైనల్ చేశారట మేకర్స్. అలాగే త్వరలో దీనిపై అధికారిక ప్రకటన రానున్నట్లు ఇండస్ట్రీ వర్గాల నుంచి సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa