by Suryaa Desk | Mon, Jan 13, 2025, 02:54 PM
బాలీవుడ్ సినిమాలలో హాట్ సాంగ్స్, టీవీ షో లలో ప్రోగ్రామ్స్, బిగ్బాస్ రియాల్టీ షోలో మాజీ కంటెస్టెంట్ గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హాట్ భామ రాఖీసావంత్.ఐటెం సాంగ్స్ తో బాలీవుడ్ లో ఫేమస్ తెచ్చుకుంది. ఈ అమ్మడు నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీ తో గాని, హాట్ కామెంట్స్ తో గాని వార్తల్లో నిలుస్తుంది. తాజాగా ఈ అమ్మకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ అమ్మడు చేసిన అరాచకం ఏంటో మీరు కూడా లుక్కెయ్యండి.బాలీవుడ్ ఐటమ్ భామ రాఖీసావంత్. ఈ అమ్మడు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కాలేజీ ఎడ్యూకేషన్ అయిపోయిన వెంటనే సినిమాల కి ఆడిషన్స్ వెళ్లడం ప్రారంభించింది. కానీ, ఈ అమ్మడు నల్లగా ఉండటంతో చాలామంది మూవీ మేకర్స్ రిజెక్ట్ చేశారు. ఈ సమయంలో తన మొఖం, శరీరాకృతిని మార్చటానికి కాస్మెటిక్ సర్జరీ చేయించుకున్నారు. ఇలా 1997లో 'అగ్ని చక్ర' అనే సినిమాతో బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. ఈ సినిమాతో ఫేమ్ సంపాదించుకున్న అమ్మడు వరుస సినిమా ఆఫర్స్ అందుకుంది.ఇలా..వెంట వెంటనే జోరు కా గులాం, ఏ రాస్తే హై ప్యార్ కే, చుర్రా హై తుమ్నే వంటి చిత్రాలలో కనిపించింది. అయితే చూరాలియా హై తుమ్ నే సినిమాలోని 'మొహబ్బత్ హై మిర్చి' అనే పాట ఆమె సినీ కెరీర్ ను పూర్తిగా మార్చేసింది. తర్వాత బాలీవుడ్ లోనే ఐటెం సాంగ్స్ కి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది రాఖి. ఈ తరుణంలో 2006లో బిగ్ బాస్ మొదటి సీజన్ లో పాల్గొనే అవకాశం అందుకుంది ఈ హాట్ బ్యూటీ. ఈ షోలో రాఖీ టాప్ ఫైవ్ లో నిలబడింది. 2017 లో కూడా మళ్లీ బిగ్ బాస్ హౌస్ లో కనిపించిన ఆమె ఈ షో తో మరింత పాపులారిటీని సంపాదించుకుంది. ఇలా .. రాఖీ సావంత్ డాన్సర్, మోడల్, నటి, టెలివిజన్ టాక్ షో హోస్ట్ రాణిస్తున్నారు. అలాగే.. హిందీ తో పాటు కన్నడ, మరాఠీ, తెలుగు, తమిళ చిత్రాలలో నటించి మెప్పించింది.
2009లో ' రాఖీ కా స్వయంవర్' అనే రియాలిటీ షోను కూడా ప్రారంభించింది. ఈ షో తరువాత ఆమె కెనడియన్ ఎలేష్ పరుజన్‌వాలాను వివాహం చేసుకుంది. కానీ వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతో అతని నుండి కొన్నాళ్లకే విడిపోయింది. ఇక 2019లో UKకి చెందిన వ్యాపారవేత్త రితేష్‌తో సీక్రెట్ గా రిలేషన్ కొనసాగించింది. ఆ తరువాత కొన్నాళ్లకు వివాహం చేసుకుంది. వీరి బంధం కూడా 2022 విడిపోయింది. సీని కెరీర్ సక్సెస్ పుల్ గా కొనసాగుతోన్న ఈ అమ్మడు జీవితంలో ప్రేమ, పెళ్లి మాత్రం కలిసి రాలేదు. రెండుసార్లు పెళ్లి చేసుకుని విడాకులు తీసుకుంది. ప్రస్తుతం రాఖీ... ఓ బాలీవుడ్ హీరోతో డేటింగ్ చేస్తున్నట్టు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.ఇదిలాఉంటే.. ఈ అమ్మడుకు సంబంధించి ఓ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రాఖీసావంత్ ఓ కుర్రాడ్ని పిలిసి.. తన సారీ కొంగును అతనిపై వేసి.. కెమెరా ముందే ముద్దుల వర్షం కురిపిస్తూ.. చుక్కలు చూపించింది. దీంతో ఆ కుర్రాడు ఒకసారిగా షాక్ అయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో 'లక్కీ ఛాన్స్ కొట్టేసావు బ్రో' అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి కొందరూ 'ఆ పిల్లాడు దడుచుకున్నాడు కావచ్చు' అంటూ పలు విధాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
Latest News