by Suryaa Desk | Thu, Jan 16, 2025, 12:14 PM
ప్రస్తుతం చిత్రపరిశ్రమలో హీరోయిన్‌ని ఎక్కువగా గ్లామర్ పాత్రలకు పరిమితం చేస్తున్నారు. హీరోతో ఒకటి రెండు రొమాంటిక్ సీన్స్, మూడు నాలుగు పాటల్లో డ్యాన్స్..అంతవరకే హీరోయిన్ పాత్రను తెరపై చూపిస్తున్నారు. కానీ ఒకప్పుడు హీరోయిన్ పాత్రకు సినిమాలో మంచి ప్రాధాన్యత ఉండేది.నటనతో మెప్పించేవాళ్లు. అలాంటి వాళ్లలో బాలీవుడ్ నటి రవీనా లాండన్ ఒకరు. 1991లో పత్తర్ కే ఫూల్ సినిమాతో వెండి తెరకు పరిచమైన ఈ బ్యూటీ..తనదైన నటనతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. అయితే తన కెరీర్ మొత్తంలో ఇప్పటివరకు లిప్‌లాక్ సీన్ చేయలేదు. అంతేకాదు రొమాంటి సన్నివేశాలకు కూడా దూరంగా ఉండేది. కానీ అనుకోకుండా ఓ హీరో లిప్‌లాక్ ఇచ్చాడట. అతని చేసిన పనికి వాంతులు చేసుకోవడమే కాకుండా.. 100 సార్లు ముఖం కూడా కడుక్కుందటతాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ లిప్‌లాక్ సంఘటన గురించి రవీనా చెప్పేకొచ్చింది. షూటింగ్‌లో భాగంగా ఓ హీరో పెదాలు..తన పెదాలను తాకాయట. దీంతో వెంటనే రవీనా వాష్‌రూమ్‌కి వెళ్లి వాంతులు చేసుకుందట. 'నాకు బాగా గుర్తుంది. ఓ సినిమా షూటింగ్‌లో హీరో అనుకోకుండా నాకు లిప్‌లాక్ ఇచ్చాడు. హీరో నన్ను రఫ్‌గా హ్యాండిల్ చేయాల్సిన సీన్ అది. ఆ సీన్ షూటింగ్ సమయంలో హీరో పెదాలు నా పెదాలను టచ్ చేశాయి.అక్కడ కిస్ చేయాల్సిన అవసరం లేదు. కానీ అనుకోకుండా అలా జరిగిపోయింది. అది నేను తట్టుకోలేకపోయాను. వెంటనే వాష్‌రూమ్‌కి వెళ్లి వాంతులు చేసుకున్నాడు. అలాగే దాదాపు 100 సార్లు నా ముఖాన్ని కడుక్కున్నాను. అనుకోకుండా జరిగినా..నేను దాన్ని తీసుకోలేకపోయాను. ఆ విషయంలో హీరో తప్పేం లేదు. నిజంగానే అనుకోకుండా అలా జరిగిపోయింది. వెంటనే హీరో నాకు సారీ కూడా చెప్పాడు'అని రవీనా టాండన్ చెప్పుకొచ్చింది.రవీనా టాండన్ తన కెరీర్ మొత్తంలో ఒక్క లిప్‌లాక్ సీన్ చేయలేదు. రొమాంటిక్, ముద్దు సన్నివేశాల్లో నటించకూడదని కెరీర్ ప్రారంభంలోనే కండీషన్ పెట్టుకుందట. అలాంటి పాత్రలు వస్తే.. సున్నితంగా తిరస్కరించేదట. తను పెట్టుకున్న కండీషన్ వల్ల చాలా పెద్ద సినిమాలను మిస్ అయ్యానని ఓ ఇంటర్వ్యూలో రవీనా టాండన్ చెప్పింది. అయితే తన కూతురు విషయం మాత్రం ఎలాంటి కండీషన్స్ పెట్టాలనుకోవట్లేదని రవీనా చెబుతోంది.రవీనా ముద్దుల తనయ రాషా తడానీ బాలీవుడ్ డెబ్యూకి రెడీ అవుతోంది. ఓ క్రేజీ ప్రాజెక్టుకు సెలెక్ట్ అయినట్లు తెలుస్తోంది. అయితే రొమాంటిక్ సీన్ల విషయంలో ఎలాంటి కండీషన్ పెట్టట్లేదట. పాత్ర డిమాండ్ చేస్తే అలాంటి సీన్లు కూడా చేసేందుకు తనకు అభ్యంతరం లేదని రవీనా అంటోంది. రవీనా సినిమా విషయాలకొస్తే.. ఆ మధ్య కేజీఎఫ్2 సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ఈ సీనియర్ హీరోయిన్..ప్రస్తుతం డైనస్టీ అనే వెబ్ షో చేస్తోంది.
Latest News