by Suryaa Desk | Tue, Jan 28, 2025, 02:07 PM
క్యాస్టింగ్ కౌచ్ పై మరో హీరోయిన్ గళం విప్పింది. దక్షిణాది పరిశ్రమలో ఒక డైరెక్టర్ తనను కమిట్మెంట్ అడిగాడంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆమిర్ ఖాన్ బ్లాక్ బస్టర్ మూవీ 'దంగల్'లో అమిర్ కూతురి పాత్రలో నటించిన ఫాతిమా సనా షేక్ ఇప్పుడు ఓ ఇంటర్వ్యూలో తన కాస్టింగ్ కౌచ్ అనుభవం గురించి మాట్లాడింది 'దంగల్' చిత్రంలో నటించి ఓవర్ నైట్ క్రేజ్ తెచ్చుకుంది నటి ఫాతిమా సనా షేక్.అయితే చాలామందికి తెలియని ఈ విషయం ఏమిటంటే ఈ అందాల తార ఒక తెలుగు లోనూ నటించింది.' సౌత్ ఇండియన్ ల్లో నటిస్తే బాలీవుడ్లో మంచి ఆఫర్లు వస్తాయి. అదే కారణంతో కొన్ని సౌత్ ఇండియన్ ల్లో నటించాలని నిర్ణయించుకున్నాను. కానీ అక్కడ నాకు చేదు అనుభవం ఎదురైంది. హైదరాబాద్‌లో ఆడిషన్ ఉంటుందని, ప్రొఫైల్ పంపమని నా స్నేహితుడు చెప్పాడు. అలాగని నా ఫోటోలు పంపితే.. నాకు ఫోన్ చేసిన వ్యక్తి 'ఈ పాత్ర కోసం ఏం చేయడానికైనా సిద్ధమేనా?' అని అడిగాడు. అతని ఉద్దేశం నాకు అర్థమైంది. కానీ, అర్థం కానట్టు, 'ఈ పాత్ర కోసం చాలా కష్టపడ్డాను. పాత్రకు కావాల్సినంత పని చేస్తాను' అని అన్నాను. కానీ అతను పదేపదే అడుగుతూనే ఉన్నాడు 'ఏదైనా చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా'? నేను కూడా అతని ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకోలేని విధంగా సమాధానమిస్తున్నాను. కానీ చివరికి అతను చిరాకుపడి ఫోన్ కట్ చేసాడు' అని ఫాతిమా తనకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకుంది.హైదరాబాద్‌లో ఓ నిర్మాతను కలిసిన సమయంలో ' ఇక్కడ నిర్మాతలు కాస్టింగ్ కౌచ్ గురించి చాలా ఓపెన్‌గా మాట్లాడుతారు. మీకు తెలుసా.. ఇక్కడ మీరు కొందరిని కలవాల్సి ఉంటుంది అనేవాళ్లు. ఆ విషయం నేరుగా చెప్పేవాళ్లుకాదు. ఎలా చెప్పినా వారి ఉద్దేశమైతే అదే అని తెలిసిపోయేది' అని ఫాతిమా తెలిపింది. దీంతో ప్రస్తుతం ఈ నటి కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Latest News