by Suryaa Desk | Thu, Jan 30, 2025, 09:09 AM
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప 2: ది రూల్’ మూవీ ప్రపంచవ్యాప్తంగా సంచలనాలను క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. సంక్రాంతి పండుగకు ముందే ఈ సినిమా రూ. 1830 ప్లస్ కోట్ల వసూళ్లను రాబట్టినట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించగా.. సంక్రాంతి తర్వాత జనవరి 17 నుండి మరో 20 నిమిషాల ఫుటేజ్‌ని మేకర్స్ యాడ్ చేసి ‘పుష్ప 2 రీలోడెడ్’ పేరుతో థియేటర్స్‌లో వదిలారు. మళ్లీ కలెక్షన్స్ పుంజుకుని.. దాదాపు రూ. 2000 కోట్ల మార్క్‌ను ఈ సినిమా అందుకున్నట్లుగా ఓ పోస్టర్ ఇటీవల బాగా వైరల్ అయింది. ఇక ఓటీటీతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఈ సినిమా.. ఓటీటీలోకి వచ్చేసింది. ‘పుష్ప 2 రీ లోడెడ్’ వెర్షన్ పేరుతో ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమా ‘నీ యవ్వ ఇక తగ్గేదే లే..’ అన్నట్లుగా అప్పుడే ఫైర్‌ని స్టార్ట్ చేసింది.సంక్రాంతికి కొత్త సినిమాలు థియేటర్లలోకి వచ్చిన నేపథ్యంలో.. అప్పుడే ‘పుష్ప 2: ది రూల్’ సినిమా సంక్రాంతి స్పెషల్‌గా ఓటీటీ రిలీజ్ ఉండబోతుందనేలా వార్తలు వైరల్ అయ్యాయి.
ఆ వార్తలను మైత్రీ మూవీస్ సంస్థ వెంటనే ఖండించింది కూడా. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీతో చేసుకున్న ఒప్పందం ప్రకారం, సినిమా విడుదలైన 56 రోజుల తర్వాత మాత్రమే ఓటీటీ స్ట్రీమింగ్కు వస్తుందని మైత్రీ వారు అధికారికంగా ప్రకటించారు. ఆ వెంటనే రీలోడెడ్ వెర్షన్ అంటూ 20 నిమిషాల అదనపు ఫుటేజ్‌ని యాడ్ చేసి.. థియేటర్స్‌లో ఫ్రెష్‌గా వదిలారు. ఇక మైత్రీవారు చెప్పిన 56 రోజుల గడువు పూర్తవడంతో.. ‘పుష్ప 2: ది రూల్’ రీ లోడెడ్ వెర్షన్ ఓటీటీలోకి వచ్చేసింది. అంతేకాదు, నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో అప్పుడే టాప్‌లో ట్రెండ్ కూడా అవుతోంది. చూస్తుంటే.. ఓటీటీలోనూ పుష్పరాజ్ తన ఫైర్ చూపించేలానే ఉన్నాడనేలా సోషల్ మీడియాలో టాక్ కూడా మొదలైంది. మొత్తం 3 గంటల 40 నిమిషాల నిడివితో.. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.
Latest News