by Suryaa Desk | Wed, Jan 29, 2025, 03:44 PM
తమ సొంత లాభం కోసం కోర్టు ఆర్డర్లపై కూడా తప్పుడు ప్రచారాలు చేసేవారిని చూస్తుంటే జాలేస్తుందని తెలుగు డాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తెలిపారు. తనకు తెలియకుండా జరిగిన యూనియన్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ గురించి పెట్టిన కేసుకు సంబంధించి వచ్చిన తీర్పుని మీరు అనుకూలంగా, నచ్చినట్లుగా మార్చి మరో కేసుతో ముడిపెట్టి పోస్టులు పెడుతున్నారని ఆరోపించారు. అసలు తీర్పు వివరాలు బయటకు వచ్చిన రోజు మీ నిజ స్వరూపం ఏంటో అందరికీ అర్థమవుతుంది అన్నారు.
Latest News