by Suryaa Desk | Thu, Jan 30, 2025, 09:10 AM
రాయలసీమ చిత్రా నేపథ్యంగా సీమ వాసులంతా మెచ్చేలా 'రాచరికం' నిర్మించినట్లు విజయ్ శంకర్, నిర్మాత ఈశ్వర్ చాణుక్యలు పేర్కొన్నారు.సినిమా ప్రచార కార్యక్రమాలలో భాగంగా బుధవారం అనంతపురం వచ్చిన హీరోలు విజయ్ శంకర్, వరుణ్ సందేశ్, హీరోయిన్ అప్సర రాణిలతో పాటు చిత్కర బృందం నగరంలోని ఓ హోటల్లో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు.ఈ సందర్భంగా నిర్మాత ఈశ్వర్ చాణుక్య మాట్లాడుతూ అనంతపురం నివాసి అయిన తాను ఇక్కడివారిని ప్రోత్సహించాలనే నేపథ్యంతో సినిమాలో టెక్నీషియన్లుగా దాదాపు 70 శాతం మందిని అనంతపురం జిల్లా వాసులను తీసుకున్నట్లు తెలిపారు.జిల్లా నుంచి మరింత మంది కళాకారులను వెలుగులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 31న విడుదల కానున్న రాచరికం సినిమాలో రాయలసీమ ఫ్యాక్షనిజం, రాజకీయాలను చూపించినట్లు తెలిపారు.అనంతరం హీరో విజయ్ శంకర్ మాట్లాడుతూ చాలా సినిమాల్లో అనంతపురం అంటే ఫ్యాక్షనిజం మాత్రమే చూపారని, కానీ ఇక్కడ ప్రేమకూ కొరత లేదని తమ చిత్రం నిరూపిస్తుంది అన్నారు. వరుణ్ సందేశ్ లో మరో కోణాన్ని ఈ సినిమాలో చూడవచ్చునన్నారు.హీరోయిన్ అప్సరా రాణి మాట్లాడుతూ అనంతపురంలో పర్యటించాలని ముందు నుంచి తనుకు ఆశగా ఉండేదని, ఆ ఆశ ఈ సినిమా ద్వారా నెరవేరిందన్నారు. కార్యక్రమంలో దర్శకుడు సురేష్ లంకలపల్లి, చాణుక్య, విజయ్ తదితరులు పాల్గొన్నారు.
Latest News