by Suryaa Desk | Wed, Jan 29, 2025, 04:07 PM
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమె అపోలో హస్పిటల్‌ను చూసుకుంటూనే ఇంట్లో ఫ్యామిలీని చూసుకుంటుంది. అయితే 11 ఏళ్ల తర్వాత ఈ జంట 2023లో తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. ఉపాసన పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆ పాపకు ‘క్లిన్ కారా’ అనే పేరు పెట్టారు. కానీ ఆ చిన్నారి ముఖాన్ని మాత్రం చూపించలేదు. అయితే నిత్యం మెగా అభిమానులు ఉపాసనను, రామ్ చరణ్‌ను అడుగుతున్నప్పటికీ చూపించడం లేదు. గత ఏడాది మొదటి పుట్టినరోజుకు చూపిస్తారని అంతా భావించారు. కానీ నిరాశనే ఎదురైంది. దీంతో అంతా క్లిన్ కారాను చూపించానలి సోషల్ మీడియా ద్వారా పోస్టులు పెడుతూ రచ్చ చేశారు. ఇక ఇటీవల రామ్ చరణ్ తనను నాన్న అని పిలిచినప్పుడు చూపిస్తాను అని చెప్పడంతో అంతా ఆనందపడ్డారు.అయితే ఉపాసన సినిమాల్లో నటించనప్పటికీ మెగా కోడలిగా స్టార్ హీరోయిన్ అంత పాపులారిటీ తెచ్చుకుంది. ఆమె కష్టాల్లో ఉన్నవారికి కూడా సాయం చేస్తూ ప్రశంసలు అందుకుంటూ ఉంటుంది. అయితే ఇటీవల చిరంజీవి భార్యతో ‘అత్త మాస్ కిచెన్’ అనే బిజినెస్ స్టార్ట్ చేయించింది. దీని ద్వారా రుచికరమైన ఆహారాన్ని జనాలకు అందిస్తుంది. అలాగే నిత్యం వార్తల్లో నిలుస్తుంటుంది. ఎంత బిజీగా ఉన్నప్పటికీ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ పోస్టులు పెడుతుంది. ఇక రామ్ చరణ్ సినిమాల గురించి కూడా వెల్లడిస్తూ ఉంటుంది. ఆమె ఏ పోస్ట్ పెట్టినా నెట్టింట నిమిషాల్లో వైరల్ అవుతుందనడంలో అతిశయోక్తి లేదు. ఇదిలా ఉంటే.. తాజాగా, ఉపాసన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఓ పోస్ట్ పెట్టింది.
చిరంజీవి(Chiranjeevi) తల్లి అంజనా దేవి(Anjana Devi) పుట్టినరోజు కావడంతో ఆమెకు స్పెషల్ విషెస్ చెప్తూ పోస్ట్ షేర్ చేసింది. ‘‘ఎంతగానో ప్రేమించే, క్రమశిక్షణ కలిగిన నానమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నీతో కలిసి జీవించడం ఎంతో సంతోషంగా ఉంది. యోగా క్లాస్ పూర్తైన తర్వాత మా ముఖాల్లో మెరుపు చూడండి. ఆమె ఇక్క క్లాస్ కూడా మిస్ కాలేదు. నిజంగా మీరు అందరికీ స్ఫూర్తి దాయకం’’ అని రాసుకొచ్చింది. అంతేకాకుండా అంజనా దేవితో తీసుకున్న ఫొటోను షేర్ చేసింది. ప్రస్తుతం ఉపాసన పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు అంజనా దేవికి శుభాకాంక్షలు చెబుతున్నారు. అంతేకాకుండా సూపర్ అని కామెంట్లు చేస్తున్నారు.