by Suryaa Desk | Wed, Jan 29, 2025, 10:52 AM
అక్కినేని నాగచైతన్య, స్టార్ హీరోయిన్ సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘తండేల్’ ఈ చిత్రానికి అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్ విడుదల సందర్భంగా నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ..‘‘మేము చాలా కష్టపడి ఈ సినిమా తీశాం. మేము ఎంత కష్టపడి తీసినా మీరు ఆదరించే స్థాయిలోనే మా ఆనందం ఉంటుంది. మీరు తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకం ఉంది. చందూ మొండేటి ఈ కథను అత్యద్భుతంగా మలిచి చాలా బాగా తీశారు. సాయిపల్లవి గారు అద్భుతంగా నటించారు. హీరో నాగచైతన్య ఏ సినిమాలోనూ ఇంతవరకు నటించని స్థాయిలో ఈ సినిమాలో నటించారు. కొన్ని సీన్స్ చూస్తే మన గుండె కరిగిపోయేలా నటించారు. ఈ సినిమాతో బెస్ట్ పెర్ఫార్మెన్స్ అనిపించుకుంటారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాలో మ్యూజిక్‌ను చించిపడేశాడు. శ్రీకాకుళంలో ఒక చిన్న ఊళ్లో జరిగిన కథను సినిమాగా తీశాం.
ఉత్తరాంధ్రవాళ్లంతా ఈ సినిమా చూసి ఆనందిస్తారనే నమ్మకం ఉంది.’’ అని చెప్పారు.ట్రైలర్ విషయానికి వస్తే.. లవ్ స్టోరీ తర్వాత జంటగా వచ్చిన నాగచైతన్య, సాయిపల్లవి స్క్రీన్‌పై అదరగొట్టేశారు. నాగ చైతన్య, సాయి పల్లవి మధ్య అదిరిపోయిన కెమెస్ట్రీకి తోడు కాస్త దేశభక్తిని కూడా జోడించి డైరెక్టర్ చందూ మొండేటి ఈ సినిమాను భారీగా ప్లాన్ చేసినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ ఇద్దరి నోటా ఉత్తరాంధ్ర యాస బాగా పలికింది. తండేల్ అంటే లీడర్ అనే విషయాన్ని ఈ ట్రైలర్ ద్వారా తెలియజేశారు. ‘రాజూ.. ఊళ్లో అందరూ మన గురించి ఏటేటో మాటాడుకుంటున్నారు రా’ అనే సాయి పల్లవి డైలాగుతో ట్రైలర్ మొదలవుతుంది. వాళ్లు అనుకుంటున్నదే నిజం చేసేద్దామని ఆమె అనగానే ఇద్దరి లవ్ స్టోరీ మొదలవుతుంది. అయితే తరచూ చేపల వేటకు వెళ్లే అతడు.. ఆమెకు దూరమవుతూ ఉంటాడు. కానీ ఓసారి పాకిస్థాన్ సరిహద్దుకు వెళ్లి అక్కడే చిక్కుకుపోతాడు. అక్కడితో ట్రైలర్ కాస్తా లవ్ ట్రాక్ నుంచి దేశభక్తి వైపు వెళ్తుంది. మా దేశంలోని ఊరకుక్కలన్నీ ఉత్తరం వైపు తిరిగి పోస్తే.. ప్రపంచ పటంలో పాకిస్థాన్ లేకుండా పోతుంది.. మా యాసను మాత్రం ఎటకారం చేస్తే రాజులమ్మ జాతరే అని రెండు పవర్ ఫుల్ డైలాగులు చైతూ నోటి వెంట వినిపిస్తాయి. మొత్తం ట్రైలర్ ఒక పవర్ ప్యాక్డ్గా ప్రేక్షకులను తొలిరోజే థియేటర్లకు రప్పించేలా ఉంది.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన పోస్టర్స్, పాటలు అన్నీ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా విడుదలైన ట్రైలర్ అంచనాలను ఆకాశానికి పెంచేసింది.
Latest News