by Suryaa Desk | Thu, Jan 30, 2025, 09:31 AM
జానీ మాస్టర్‌పై ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పెట్టిన కేసు గెలిచినట్లుగా ఝాన్సీ ప్రకటిస్తే.. ఆ వెంటనే కౌంటర్ పోస్ట్ పెట్టారు జానీ మాస్టర్. తమ సొంత లాభం కోసం కోర్టు ఆర్డర్లపై కూడా తప్పుడు ప్రచారాలు చేసేవారిని చూస్తుంటే జాలేస్తుందని జానీ మాస్టర్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. దీంతో.. కొన్ని రోజులుగా సైలెంట్ అయిన జానీ మాస్టర్‌పై మళ్లీ వార్తలు మొదలయ్యాయి. అసలు విషయం ఏమిటంటే..జానీ మాస్టర్‌పై ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పెట్టిన ఒక కేసును నెగ్గినట్లుగా టాలీవుడ్ లైంగిక వేధింపుల కమిటీలోని సభ్యురాలైన నటి ఝాన్సీ సోషల్ మీడియా వేదికగా ఓ రిపోర్ట్‌ని పోస్ట్ చేసింది. ఆ రిపోర్ట్‌పై జానీ మాస్టర్ కూడా వెంటనే రియాక్ట్ అవుతూ.. కోర్టు ఆర్డర్లపై కూడా తప్పుడు ప్రచారాలు చేసేవారిని జాలేస్తుంది అంటూ.. ఆయన కూడా సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ చేశారు. ఈ ఇద్దరి స్టేట్మెంట్స్తో అసలు విషయం ఏమిటనేది కన్ఫ్యూజన్గా మారింది.
ముందుగా ఝాన్సీ పోస్ట్ గమనిస్తే.. ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వేసిన కేసుపై సవాల్ చేస్తూ జిల్లా కోర్టులో జానీ మాస్టర్ వేసిన మధ్యంతర పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. పని చేసే ప్రదేశాలలో మహిళల భద్రతకు ప్రాధాన్యం ఉంటుందని, POSH మార్గదర్శకాలను అమలు చేసే సంస్థలకు ఎప్పుడూ మద్దతు ఉంటుందనేది మరోసారి రుజువైంది. నిజంగా ఇది చాలా ముఖ్యమైన తీర్పు. ఈ విషయంలో ఫెడరేషన్ కఠినంగా ఉండి, ధర్మం వైపు నిలబడినందుకు తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలికి ధన్యవాదాలు.. అని ఝాన్సీ తన పోస్ట్‌లో పేర్కొంది.ఝాన్సీ చేసిన పోస్ట్‌కు కౌంటర్ అనేలా జానీ మాస్టర్.. ‘‘తమ సొంత లాభం కోసం కోర్టు ఆర్డర్లపై కూడా తప్పుడు ప్రచారాలు చేసేవారిని చూస్తుంటే జాలేస్తుంది. ముందస్తుగా నాకు తెలియకుండా జరిగిన యూనియన్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ గురించి నేను పెట్టిన కేసుకి సంబంధించి వచ్చిన తీర్పుని మీకు అనుకూలంగా, నచ్చినట్టుగా మార్చి మరో కేసుతో ముడిపెట్టి పోస్టులు పెడుతూ ఉన్నారు. మీరేది చెప్పినా ప్రజలు నమ్ముతారనుకుంటున్నారేమో కానీ అసలు తీర్పు వివరాలు బయటకి వచ్చిన రోజున మీ నిజస్వరూపమేంటో, దేనికోసం ఈ దుష్ప్రచారం చేస్తున్నారనేది అందరికీ అర్థమవుతుంది. ఆ రోజు ఎంతో దూరం లేదు. న్యాయమే గెలుస్తుంది, నిజం అందరికీ తెలుస్తుంది’’ అని తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
Latest News