|
|
by Suryaa Desk | Fri, Dec 27, 2024, 07:23 PM
తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులు, ఉద్యోగులు ఎగిరిగంతేసే వార్త వినిపించింది రేవంత్ రెడ్డి సర్కార్. రెండు మూడు రోజుల్లో కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతున్న నేపథ్యంలో.. 2025 సంవత్సరానికి సంబంధించిన పబ్లిక్, ఆప్షనల్ హాలిడేస్ లిస్టును తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. 2025 ఏడాదిలో మొత్తంగా 27 సాధారణ సెలవులు వస్తుండగా.. 23 ఆప్షనల్ హాలిడేస్ ఇస్తున్నట్టు ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొంది.
ముఖ్యంగా.. జనవరి ఒకటో తేదీతోనే సెలవుల జాబితాను మొదలుపెట్టిన ప్రభుత్వం.. జనవరి 14వ తేదీని సంక్రాంతి పండుగకు.. మార్చి 30న ఉగాది పండుగకు, ఆగస్టు 27వ తేదీన వినాయక చవితి, అక్టోబర్ 3వ తేదీన దసరా.. అక్టోబర్ 20న దీపావళి లాంటి పెద్ద పండుగలన్నింటికి ఎప్పటిలాగే ప్రభుత్వ సెలవులను ప్రకటించింంది. అయితే.. జనవరి ఒకటో తారీఖును సెలవు ప్రకటించిన ప్రభుత్వం.. అందుకు బదులుగా ఫిబ్రవరి 10న రెండో శనివారాన్ని వర్కింగ్ డేగా ప్రకటిస్తూ ఉత్తర్వులు వెల్లడించింది.
అయితే.. బోనాల పండుగకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం.. రంజాన్ పండగతో పాటు తర్వాతి రోజున, దసరా పండుగతో పాటు తర్వాతి రోజున కూడా సెలవు ప్రకటించింది. అయితే.. దసరా పండుగ గాంధీ జయంతి రోజున రావటం గమనార్హం. మరోవైపు.. జూన్ నెలలో ఒక్క సెలవు కూడా లేకపోవటం గమనార్హం.
2025లో జనరల్ హాలిడేస్ ఏంటంటే..
న్యూఇయర్ (జనవరి 1)
భోగి (జనవరి 13)
సంక్రాంతి (జవనరి 14)
రిపబ్లిక్ డే (జనవరి 26)
మహా శివరాత్రి (ఫిబ్రవరి 26)
హోళీ (మార్చి 14)
ఉగాది (మార్చి 30)
ఈద్ ఉల్ ఫితర్ (మార్చి 31)
రంజాన్ (ఏప్రిల్ 01)
బాబు జగ్జీవన్ రాం జయంతి (ఏప్రిల్ 05)
శ్రీరామనవవి (ఏప్రిల్ 06)
అంబేడ్కర్ జయంతి (ఏప్రిల్ 14)
గుడ్ ఫ్రైడే (ఏప్రిల్ 18)
బక్రీద్ (జూన్ 07)
మొహర్రం (జులై 06)
బోనాలు (జులై 21)
ఇండిపెన్‌డెన్స్ డే (ఆగస్టు 15)
శ్రీ కృష్ణాష్టమి (ఆగస్టు 16)
వినాయక చవితి (ఆగస్టు 27)
ఈద్ మిలాదిన్ నబీ (సెప్టెంబర్ 05)
బతుకమ్మ మొదటి రోజు (సెప్టెంబర్ 21)
దసరా/గాంధీ జయంతి (అక్టోబర్ 02)
విజయదశమి తర్వాతి రోజు (అక్టోబర్ 03)
దీపావళి (అక్టోబర్ 20)
కార్తీక పౌర్ణమి/గురునానక్ జయంతి (నవంబర్ 05)
క్రిస్టమస్ (డిసెంబర్ 25)
క్రిస్టమస్ తర్వాతి రోజు (డిసెంబర్ 26)