|
|
by Suryaa Desk | Tue, Mar 18, 2025, 03:27 PM

దేవరకొండ మండలం ముదిగొండ గన్యానాయక్ తండాకు చెందిన నేనావత్ దేవులనాయక్ టీజీపీఎస్సీ విడుదల చేసిన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్(గ్రేడ్-2) ఉద్యోగానికి ఎంపికైనట్లు మంగళవారం తెలిపారు.
జోనల్ ర్యాంక్ 196 సాధించినట్లు చెప్పారు. ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలో పీహెచ్డీ చివరి సంవత్సరం కొనసాగిస్తున్నట్లు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు, తండావాసులు, తోటి స్నేహితులు, సంతోషం వ్యక్తం చేశారు.