|
|
by Suryaa Desk | Thu, Jan 29, 2026, 12:04 PM
నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేటలో విషాదం చోటుచేసుకుంది. 16 ఏళ్ల ప్రశాంత్, సువర్ణ అనే మైనర్లు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి వ్యవహారం గమనించిన పెద్దలు వారిని మందలించడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఒకే చీరతో ఇద్దరూ ఫ్యాన్‌కు ఉరివేసుకుని విగతజీవులుగా మారారు. మరుసటి రోజు ఉదయం తలుపులు బద్దలు కొట్టి చూడగా వారిద్దరూ విగతజీవులుగా పడి ఉండటం చూసి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. ఈ ఘటన కన్నవారికి తీరని కడుపుకోతను మిగిల్చింది.