గత బిఆర్ఎస్ ప్రభుత్వం తరహాలోనే నూతన కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో సైతం హిందువులపై దాడులు జరుగుతున్నాయని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆరోపించారు. ఇటీవల మెదక్ లో జరిగిన సంఘటనలో గాయపడ్డ బిజెపి నాయకులను హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఎమ్మెల్యే హరీష్ బాబుతో కలిసి మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడి ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. మెదక్ ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa