తెలంగాణలోని మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నర్సాపూర్ పట్టణానికి చెందిన రెండు ప్రైవేట్ కాలేజీ బస్సులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో రెండు బస్సుల డ్రైవర్లతో సహా పది మంది విద్యార్థులకు తీవ్రగాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను చికిత్సా నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa