ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెళ్లికి ముందు వరుడు స్పెషల్ డిమాండ్లు.. ఆశ్చర్యపోయిన అమ్మాయి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Dec 12, 2024, 07:53 PM

భారతీయ సమాజంలో పెళ్లికి ఉన్నంత ప్రాధాన్యం, ప్రత్యేకత మరే సందర్భానికి లేదంటే అతిశయోక్తి లేదు. పేదవాడి నుంచి కుబేరుడి వరకు తమ పిల్లల పెళ్లిని ఉన్నంతలో ఘనంగా జరపాలనుకుంటారు. ఖరీదైన బట్టలు, ఆభరణాలు, విలాసవంతమైన వస్తువులు అంటూ నానా హడావుడి చేస్తారు. మండపాలు, కన్వెన్షన్ సెంటర్ల వరకు చాలానే ఖర్చు చేస్తుంటారు. ఇక పెళ్లికి ముందు ఫ్రీ వెడ్డింగ్ షూట్, సంగీత్, పెళ్లి లైవ్ స్ట్రీమింగ్, బరాత్ ఇలా రకరకాలుగా పెళ్లి తంతు జరుపుకుంటుటారు. గతంలో ఇలాంటివి లేకున్నా.. కాలం మారుతున్నకొద్ది పెళ్లి తంతు కొత్త పుంతలు తొక్కుతుంది.


పాత పద్దతుల్లో వివాహాలు చేసుకునేవారు చాలా అరుదనే చెప్పాలి. తాజాగా.. తెలంగాణలోని కోదాడ పట్టణంలో జరిగిన ఓ వివాహ తంతు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుత కాలానికి భిన్నంగా.. పాత పద్దతుల్లో వివాహం జరిపించాలని వరుడు పెళ్లికి ముందు డిమాండ్లు పెట్టాడు. అవి విన్న వధువు, ఆమె తరపు బంధువులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈరోజుల్లోనూ ఇలాంటి వారు ఉంటారా..! అని ఆశ్చర్యపోయి ఆనందంగా పెళ్లికి రెడీ అయిపోయారు.


పెళ్లి కుమారుడి డిమాండ్లు ఇవే..


* ప్రీ వెడ్డింగ్ షూట్ ఉండదు.


* పెళ్లిలో వధువు లెహంగాకు బదులుగా చీరను ధరించాలి.


* అసభ్యకరమైన డీజేకు బదులుగా వివాహ వేదిక వద్ద తేలికపాటి వాయిద్య సంగీతం ప్లే చేయాలి.


* దండ వేసే సమయంలో వధూవరులు మాత్రమే వేదికపై ఉండాలి.


* వరమాల సమయంలో వధువు లేదా వరుడిని వేధించే వారు వివాహం నుంచి బహిష్కరించబడతారు.


* పురోహితుడు వివాహ ప్రక్రియను ప్రారంభించిన తర్వాత అతనిని ఎవరూ ఆపకూడదు.


* కెమెరామెన్ దూరం నుంచి ఫోటోలు తీస్తాడు. అవసరం మేరకు.. ఎవరికీ అంతరాయం కలిగించకుండా దగ్గర నుండి కొన్ని ఫోటోలు తీస్తాడు. పురోహితుడికి పదే పదే అంతరాయం కలిగించడం మాత్రం చేయకూడదు.


* ఇది తమ సాక్ష్యంలో దేవుళ్ళను పిలిపించి జరిపే కళ్యాణం, సినిమా షూటింగ్ కాదు.


* పగటిపూట కళ్యాణోత్సవం నిర్వహించి సాయంత్రంలోగా వీడ్కోలు పూర్తి చేయాలి. తద్వారా మధ్యాహ్నం 12 నుంచి 1 గంటకు ఆహారం తీసుకోవడం వల్ల నిద్రలేమి, అసిడిటీ తదితర సమస్యలతో అతిథి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు.


* అతిథులు తమ ఇంటికి చేరుకోవడానికి అర్ధరాత్రి వరకు సమయం తీసుకోకూడదు. ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలి.


* తాళి కట్టిన వెంటనే అందరి ముందు ఎవరైనా ముద్దు పెట్టుకోమని, కౌగిలించుకోవాలని అడిగితే అలాంటి వారిని వెంటనే పెళ్లి నుంచి బహిష్కరిస్తారు.


పెళ్లి కుమారుడు పెట్టిన ఈ డిమాండ్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అబ్బాయి డిమాండ్లన్నింటిని అమ్మాయి ఆనందంగా అంగీకరించగా.. సమాజాన్ని బాగుచేసే అందమైన సూచనలు, అందరికి ఆదర్శమని కొనియాడుతున్నారు. వివాహం అనేది ఒక పవిత్ర కార్యక్రమని.. దానిని గౌరవించి మన సాంప్రదాయాన్ని కాపాడుకోవాలని సూచిస్తున్నారు. ఈ రోజుల్లోనూ ఇలాంటి వారు ఉండటం ఆశ్యర్యం కలిగిస్తుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. 'అతి ఎచ్చుల కాలంలో.. సాంప్రదాయంగా ఉన్నారంటే గ్రేట్ బాబు.. మీలాంటోళ్లు ఇంకా ఉండబట్టే కొద్దిగానైనా భారతీయ సాంప్రదాయం మంటగలవకుండా ఉంటుంది' అని కామెంట్లు పెడుతున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com