ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కోదాడలో సైన్స్ ఫేర్ కు ఏర్పాట్లు పూర్తి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Dec 19, 2024, 01:54 PM

సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని సిసి రెడ్డి కాన్వెంట్ స్కూల్లో రెండు రోజులు జరగబోయే సైన్స్ ఫేర్ కు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు జిల్లా సైన్స్ ఫెర్ అధికారి దేవరాజ్ అన్నారు. ఎంఈఓ సలీం షరీఫ్ తో కలిసి ఆయన పరిశీలించారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ... 291 మంది విద్యార్థులు సైన్స్ ఫెర్ లో పాల్గొంటున్నట్లు తెలిపారు. 84 అవార్డులు చేస్తున్నట్లు తెలిపారు.
సుమారు 3000 పైగా విద్యార్థులు విద్య పరిజ్ఞాన ప్రదర్శన ను చూసేందుకు వస్తున్నట్లు తెలిపారు. రెండు రోజులు జరిగే ఈ కార్యక్రమానికి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు , ప్రధాన ఉపాధ్యాయులు,ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa