ప్రభుత్వం ఈనెల 26 నుంచి ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న నాలుగు సంక్షేమ పథకాలను జనంలోకి తీసుకెళ్లి అమలు అయ్యేలా చూసే బాధ్యత ఇందిరమ్మ కమిటీలదేనని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం పెద్దమందడి మండలం కాంగ్రెస్ ఇందిరమ్మ కమిటీలతో మంగంపల్లిలో సమావేశం నిర్వహించారు. 21, 22, 23 తేదీల్లో నిర్వహించే గ్రామసభలలో అధికారులతో సమన్వయం చేసుకుంటూ అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందేలా చూడాలని సూచించారు.