గణతంత్ర దినోత్సవం రోజున రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వరంగల్ శివారు లోని మామునూరు వద్ద ఆటోలపై లారీ బోల్తా పడింది.ఈ ప్రమాదంలో ఆటోల్లో ఉన్న నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరికొందరికి తీవ్ర గాయాలు అయ్యాయి. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. లారీ బోల్తా పడటానికి ఓవర్ లోడ్ కారణమని నిర్ధారించారు.మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.