పాఠశాల ఆవరణలో మద్యం సీసాలు, కండోమ్ ప్యాకెట్లు కనిపించడంతో జగిత్యాలలో కలకలం రేగింది. గణతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి ఏర్పాట్లలో భాగంగా శనివారం కొంతమంది విద్యార్థులు స్కూలు ఆవరణను శుభ్రం చేస్తున్నారు. చెట్లకింద, మైదానంలో పేరుకుపోయిన చెత్తను తొలగిస్తుండగా మద్యం సీసాలు, వాడిపడేసిన కండోమ్ ప్యాకెట్ కనిపించాయంటూ టీచర్లు ఆవేదన వ్యక్తం చేశారు.పవిత్రమైన పాఠశాల ఆవరణను ఆకతాయిలు అసాంఘిక కార్యక్రమాలకు కేంద్రంగా చేసుకున్నారంటూ వాపోయారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని క్రిస్టియన్ స్కూల్ ఇంటర్నేషన్ (CSI) ఎయిడెడ్ బాలికల పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే, బాలికలతో పాఠశాల ఆవరణను శుభ్రం చేయించడం ఏంటని ఉపాధ్యాయులపై స్థానికులు, నెటిజన్లు మండిపడుతున్నారు.