ఆన్ లైన్ స్టోరేజీ పరిమితిని పెంచుతున్నట్లు గూగుల్ తెలిపింది. ప్రస్తుతం ఉన్న 15జిబి పరిమితిని 1టీబీకి అప్రేడ్ చేస్తున్నట్లు బ్లాగ్ లో పేర్కొంది. కానీ, కేవలం గూగుల్ వర్క్ స్పేస్ సబ్ స్రైబర్లకు మాత్రమే ఇది వర్తిస్తుందని తెలిపింది. 15జీబీ కంటే అదనపు స్టోరేజ్ కావాలంటే నెలవారీ అద్దె చెల్లించాల్సిందే. తాజాగా 15జీబీ నుంచి 1టీబీకి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతోపాటు గూగుల్ డ్రైవ్ ను కూడా అప్డేట్ చేసింది.