ట్విట్టర్ బ్లూ టిక్ కోసం నెలకు 8 డాలర్ల చందా చెల్లించాలని ప్రకటించింది. కానీ, ఈ బ్లూ టిక్ సబ్ స్క్రిప్షన్ ను నిలిపి వేసినట్టు తెలుస్తోంది. సబ్ స్క్రైబ్ చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటే ‘‘మీ ఆసక్తికి ధన్యవాదాలు. ట్విట్టర్ బ్లూటిక్ మీ దేశంలో త్వరలోనే అందుబాటులోకి వస్తుంది. తర్వాత వచ్చి చెక్ చేసుకోండి’’ అంటూ సందేశం కనిపిస్తోంది. ప్రముఖుల పేరిట నకిలీ ఖాతాలు తీసుకుంటున్నందుకే బ్లూటిక్ నిలిపివేసినట్లు సమాచారం.