తమ యూజర్ల కోసం బ్లూటిక్ ప్లాన్ మళ్లీ తీసుకొస్తున్నట్లు ట్విట్టర్ అధినేత ఎలన్ మస్క్ ప్రకటించారు. నకిలీల బెడద తట్టుకునేలా మార్పులు చేసి ఈ నెల 29న రీలాంఛ్ చేయనున్నట్లు చెప్పారు. మస్క్ ట్విట్టర్ కొనుగోలు చేసిన తర్వాత బ్లూటిక్ ఛార్జీల పెంపు వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సెలబ్రిటీల పేర్లతో ఖాతాలు తెరిచే వారి సంఖ్య ఎక్కువవడంతో బ్లూ టిక్ సేవలు ట్విట్టర్ తాత్కాలికంగా నిలిపేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa