మొబైల్ ఫోన్ తయారీ కంపెనీలు కొత్త బాటలో నడుస్తున్నాయి. చార్జర్ లేకుండానే ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. యాపిల్, శామ్ సంగ్, గూగుల్ ఇప్పటికే ఫోన్లతో చార్జర్ ఇవ్వడం మానేశాయి. ఇప్పుడు వన్ ప్లస్, ఒప్పో కంపెనీలు కూడా ఫోన్ తో పాటు చార్జర్ ఇవ్వడాన్ని నిలిపివేయనున్నట్టు సమాచారం. కాబట్టి మీరు ఫోన్ కొనేముందు ఛార్జర్ ఉందో లేదో ఓసారి చెక్ చేసుకోండి.