క్రెడిట్ కార్డు ఒక్కటి ఉంటేనే మంచిది. ఆదాయం మెరుగ్గా ఉంటే మరొకటి వాడొచ్చు. రెండు కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులు ఉంటే వెంటనే వాటిని బ్లాక్ చేయించండి. పెండింగ్ బిల్లులకు భయపడి వాటిని బ్లాక్ చేయకపోతే ఆర్థికంగా మరింత నష్టపోయే ప్రమాదముంది. బిల్లు ఎగ్గొట్టాలని చూస్తే మొదటికే మోసం వస్తుంది. కార్డు బిల్లులు గడువులోపు కట్టకపోతే.. బ్యాంకు నుంచి ఫోన్లు మొదలవుతాయి. వారికి సమాధానం చెప్పలేక తప్పించుకోవాలనే ఆలోచన పుడుతుంది. మరోవైపు సిబిల్ స్కోర్ పడిపోవడంతో భవిష్యత్తులో గృహరుణం, పిల్లల చదువుకు ఎడ్యుకేషన్ లోన్ రాకుండా పోతుంది. ఒకట్రెండు క్రెడిట్ కార్డులుంటే గడువులోగా బిల్లులు సులువుగా కట్టొచ్చు. ఎక్కువ కార్డులుంటే తడిసిమోపడవుతుంది.