ప్రపంచ వ్యాప్తంగా 487 మిలియన్ల వాట్సాప్ ఖాతాలు హ్యాక్ అయినట్లు వదంతులు వస్తున్నాయి. వాట్సాప్ యూజర్ల డేటాను హ్యాకర్లు విక్రయానికి పెట్టారని వార్తలొచ్చాయి. దీనిని వాట్సాప్ యాజమాన్యం ఖండించింది. ఈ తరుణంలో మీ వాట్సాప్ హ్యాక్ అయిందో లేదో తెలుసుకునే వీలుంది. ఇందు కోసం www.cybernews.comను సందర్శించవచ్చు. వెబ్‌సైట్ ఓపెన్ చేశాక, అంతర్జాతీయ ఫార్మాట్‌లో ముందుగా +91 కోడ్‌ను తర్వాత మీ ఫోన్ నంబరును లేదా ఈ-మెయిల్ ఐడీని నమోదు చేయాలి. తర్వాత 'చెక్ నౌ' క్లిక్ చేయాలి. తద్వారా మీ డేటా లీక్ అయిందో లేదో తెలుస్తుంది.