గూగుల్ తన వర్క్ స్పేస్ లోని యాప్స్ ను అప్ డేట్ చేసింది. జీమెయిల్ సహా ఇతర యాప్ లలో కొత్తగా మార్పులు చేసినట్లు తెలిపింది. జీమెయిల్ లోని సెర్చ్ ఫీచర్ ను గతంలోకంటే మరింత మెరుగుపరిచినట్ల్లు గూగుల్ తెలిపింది. గూగుల్ షీట్స్ లో పివోట్ టేబుల్స్ ను క్రియేట్ చేసి, ఎడిట్ చేసేటప్పుడు వాటి సైజును యూజర్ తనకు అనువుగా మార్చుకునే సౌకర్యం కల్పించింది. అలాగే గూగుల్ మీట్ లో యూజర్లు డాక్స్, స్లైడ్స్, షీట్స్, నించి మీట్ లో పాల్గొంటూ ఫైల్స్ ను షేర్ చేయొచ్చు. గతవారం క్రోమ్ లో గుర్తించిన జీరో-డే సమస్యను సరిచేస్తూ గూగుల్ కొత్త అప్ డేట్ ను విడుదల చేసింది. అంతేకాకుండా మడతఫోన్లు, ట్యాబ్లెట్స్ వంటి పెద్ద డిస్ ప్లే ఉన్న డివైజ్ ల కోసం గూగుల్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఫీచర్ ను తీసుకొచ్చింది.