వేలాది యూట్యూబ్ ఛానళ్లపై గూగుల్ వేటు వేసింది. చైనా, రష్యా మరియు బ్రెజిల్‌లోని వేలకొద్దీ యూట్యూబ్ ఛానెల్‌లను గూగుల్ కోఆర్డినేటెడ్ ఇన్‌ఫ్ల్యూషన్ ఆపరేషన్‌ల పరిశోధనలో భాగంగా ప్రక్షాళన చేసింది. గూగుల్ 5,197 యూట్యూబ్ ఛానళ్లు, 17 బ్లాగర్ల బ్లాగ్ లను రద్దు చేసింది. ఈ ఛానెల్‌లు మరియు బ్లాగ్‌లు సంగీతం, వినోదం మరియు జీవనశైలి గురించి చైనీస్‌లో ఎక్కువగా స్పామ్ కంటెంట్‌ని అప్‌లోడ్ చేస్తున్నాయని, చైనా మరియు యుఎస్ విదేశీ వ్యవహారాల గురించి చైనీస్ మరియు ఇంగ్లీషులో కంటెంట్ అప్ లోడ్ చేస్తున్నాయని గూగుల్ తెలిపింది. గూగల్ రష్యాకు చెందిన 718, బ్రెజిల్ కు చెందిన 76 యూట్యూబ్ ఛానళ్లపైనా వేటు వేసింది.