భారత్‌లో 5జీ ఇంటర్నెట్ సేవలు అత్యంత వేగంగా నగరాలు, పట్టణాలకు విస్తరిస్తున్నాయి. అక్టోబర్ 1న 5జీ లాంఛ్ అయినప్పటి నుంచి డిసెంబర్ 7 వరకూ ఇప్పటివరకూ 50 నగరాలకు 5జీ సేవలనువిస్తరించామని కేంద్ర టెలికాం మంత్రి అశ్వని వైష్ణవ్ పార్లమెంట్ వేదికగా వెల్లడించారు. రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ ప్రస్తుతం భారత్‌లో 5జీ సేవలను అందిస్తుండగా 2024 వరకూ 5జీని దేశవ్యాప్తంగా విస్తరించేందుకు సన్నాహాలు చేపట్టాయి. 2023 డిసెంబర్ నాటికి భారత్‌లోని అన్ని నగరాలు, ముఖ్య పట్టణాలకు 5జీని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రిలయన్స్ జియో కసరత్తు సాగిస్తోంది.