అత్యంత చౌక కారు ‘నానో’ ఈవీని టాటా గ్రూప్ లాంఛ్ చేయనుందనే అంచనాలు మార్కెట్ లో షికారు చేస్తున్నాయి. ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో నానో ప్రాజెక్ట్స్ తిరిగి పునరుజ్జీవింపచేస్తోందని నివేదికల ద్వారా తెలుస్తోంది. 2008లో కేవలం రూ.లక్షకే అందుబాటులోకి తీసుకొచ్చిన నానో అమ్మకాలు సరిగ్గా లేక 2019లో తయారీని నిలిపేసింది. తాజాగా నానో ఎలక్ట్రిక్ మోడల్ తీసుకువచ్చేలా టాటా ప్లాన్ చేస్తోందట. ప్రస్తుతం టాటా నెక్సాన్, టిగార్, టియాగో లాంటి ఈవీలను అందిస్తోంది. సమీప భవిష్యత్తులో మరిన్ని ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేసేలా ప్రణాళిక చేస్తోంది.