నిత్యం అనేకమంది గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ను ఉపయోగిస్తుంటారు. కానీ ఇది సిస్టమ్ ర్యామ్‌ను ఎక్కువగా ఉపయోగిస్తుందనేది చాలా మంది యూజర్ల అభిప్రాయం. ఇదే విషయమై గూగుల్‌కు చాలాకాలంగా ఫిర్యాదులు చేస్తున్నారు. కాగా గూగుల్ ఎట్టకేలకు ఈ సమస్యను పరిష్కరించనున్నట్లు తెలిపింది. కొత్తగా మెమొరీ సేవర్, ఎనర్జీ సేవర్ అనే 2 కొత్త మోడ్‌లను క్రోమ్ బ్రౌజర్‌లో తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఈ రెండు కూడా యూజర్ క్రోమ్ బ్రౌజర్ ఉపయోగించేటప్పుడు పీసీ/కంప్యూటర్‌లోని బ్యాటరీ, మెమొరీపై భారాన్ని తగ్గిస్తాయని తెలిపింది. యూజర్లు క్రోమ్ (v108) కొత్త వెర్షన్‌ను అప్‌డేట్ చేసుకుని వీటి సేవలను పొందొచ్చు. దశలవారీగా పూర్తిస్థాయిలో యూజర్లకు వీటిని పరిచయం చేయనున్నారు.