మొదటగా అధికారిక యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) పోర్టల్‌కి వెళ్లాలి. మీ యూఎన్, పాస్‌వర్డ్ ఉపయోగించి లాగిన్ కావాలి. ‘ఆన్‌లైన్ సేవలు' ట్యాబ్‌కు వెళ్లి డ్రాప్-డౌన్ మెను నుంచి 'క్లెయిమ్ (ఫారం 19, 31, 10C లేదా 10D)' ఎంపిక చేసుకోవాలి. తదుపరి స్క్రీన్‌లో మీ బ్యాంక్ ఖాతా నంబర్‌ను నమోదు చేసి 'వెరిఫై' బటన్‌పై క్లిక్ చేయాలి. 'అవును'పై క్లిక్ చేసి ముందుకు సాగండి. తర్వాత 'ప్రొసీడ్ ఫర్ ఆన్‌లైన్ క్లెయిమ్'పై క్లిక్ చేయాలి. క్లెయిమ్ ఫారమ్‌లో 'నేను దరఖాస్తు చేయాలనుకుంటున్నాను' ట్యాబ్ కింద మీకు అవసరమైన దావాను ఎంచుకోండి. నిధులను ఉపసంహరించుకోవడానికి ఒక ఫారమ్‌ను ఎంచుకోవాలి. దీని కోసం 'పీఎఫ్ అడ్వాన్స్ (ఫారం 31)' ఎంపిక చేసుకోవాలి. ఈ ఫారమ్‌ను పూరించిన తరువాత.. స్కాన్ చేసిన పత్రాలను సమర్పించాలి. ఉపసంహరణ అభ్యర్థనను కంపెనీ యజమాని ఆమోదించిన తర్వాత మీ బ్యాంక్ ఖాతాలో నగదు జమ అవుతుంది.